రాజమండ్రిలోని కంబాల చెరువు సెంటర్ వద్ద ఉన్న ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ABN రాధాకృష్ణ తీరుపై వేణు మండిపడ్డారు. రాధాకృష్ణ జర్నలిజం కాదని, కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. కూటమి నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారని అదనపు సమాచారం తెలుస్తోంది.