
టీడీపీ నేత జోగి నాయుడు జీవకారుణ్య సంగం డైరెక్టర్ గా నియామకం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిస్కా జోగి నాయుడు రాజమహేంద్రవరంలో జీవకారుణ్య సంగం డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల పరిరక్షణ, వృద్ధులు, అనాధ బాలలకు వసతి కల్పన వంటి దాత ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం సంఘ డైరెక్టర్లు ఆయనను సన్మానించారు.








































