
రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ రాజమండ్రిలో పార్టీ నేతలతో భేటీ
శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం రాజమండ్రికి విచ్చేసిన బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తుతో సహా ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత, అంతర్గత అంశాలపై చర్చించి, పార్టీ బలోపేతానికి నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ఆయన నాయకులను కోరారు.






































