రాజమండ్రి రూరల్ కడియం మండలం జేగురుపాడులో శనివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో రికార్డులు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఒక బెల్ట్ షాపుపై దాడి చేసి 35 క్వార్టర్ల మద్యం సీసాలను సీజ్ చేశారు. కడియం ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర రావు ఆధ్వర్యంలో పాముల మెట్ట కాలనీలో ఈ ఆపరేషన్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.