రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని బొమ్మూరులో బుధవారం చేపల మేత లోడుతో వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయి బోల్తా పడింది. లారీ రహదారి పక్కన ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ప్రాణ నష్టం తప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.