రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

1చూసినవారు
రాజమండ్రిలో మెగా జాబ్ మేళా
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు, వికాస మరియు ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా అక్టోబర్ 3వ తేదీ శనివారం రాజమహేంద్రవరంలోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఉమెన్స్)లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఈ మేళాలో 33 ప్రముఖ కంపెనీలు పాల్గొని, సుమారు 1,600 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బుధవారం సూచించారు. మరిన్ని వివరాల కోసం 7660823903 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్