ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న PGRS & రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జూన్ 29వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిల్లో యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రజలు meekosam. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో & 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని, PGRSకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల స్థితిగతులను కూడా 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని ఆమె వివరించారు.