కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2026ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ను ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వీక్షించాలని తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర శనివారం పిలుపునిచ్చారు. ఆదివారం బొమ్మూరులో శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవం కార్యక్రమానికి శ్రేణులు భారీగా తరలివచ్చి పాల్గొని, స్వర్ణోత్సవం కార్యక్రమాన్ని జయప్రదంచెయ్యాలని ఆయన వెల్లడించారు.