కడియం మండలం వేమగిరి సబ్-స్టేషన్లోని జేగురుపాడు ఫీడర్ కు ఈనెల 6, 7 తేదీలలో RDSS పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ జే. పి. బి. నటరాజన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జేగురుపాడు, కడియపు సావరం తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.