రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయి

514చూసినవారు
రాజమండ్రిలో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. పార్టీని, ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలను అసభ్యకర భాషతో దూషించినందున ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్