ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1950 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.