రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద మహా శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 15న జరిగే మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో, భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. రాజమండ్రి, కొవ్వూరు డివిజన్లలో గుర్తించిన ప్రధాన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.