పుష్కరాల నాటికి రోడ్లు, డ్రైనేజీలు పూర్తి: ఎమ్మెల్యే గోరంట్ల

259చూసినవారు
పుష్కరాల నాటికి రోడ్లు, డ్రైనేజీలు పూర్తి: ఎమ్మెల్యే గోరంట్ల
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం ఆర్&బి, పి.ఆర్ శాఖల అధికారులతో కలిసి ఎన్.హెచ్5 నుండి పాత బొమ్మూరు, పిడింగొయ్యి, కవలగొయ్యి, బుచ్చయ్య నగర్, పిట్టలవాని చెరువు, సాటిలైట్ సిటీ, పాత బొమ్మూరు వరకు రోడ్లను పరిశీలించారు. పుష్కరాల నాటికి నియోజకవర్గంలోని రోడ్లను, డ్రైనేజీలను నూతన ప్రణాళికతో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు రోడ్ల విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్