భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) తూర్పుగోదావరి జిల్లా యూత్ కన్వీనర్‌గా నీలపాల సాయి మణికంఠను నియమించారు. పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్, సాయి మణికంఠ పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని, యువతను సమీకరించడంలో ఆయనకున్న నైపుణ్యాన్ని గుర్తించి ఈ పదవిని కేటాయించారు. ఈ నియామకంపై సాయి మణికంఠ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ ఆశయాలను యువతకు చేరవేసి, వారి సమస్యలపై పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.