కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని జిల్లా
వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సుష్క వాగ్దానాలు తప్ప, శూన్యం తప్ప ఏమీ చేయలేదని, బూటకపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం డొల్లతనాన్ని ప్రజలు గుర్తించారని వారు పేర్కొన్నారు.