సంత్ రవిదాస్ జయంతి: చర్మకారులకు సురేష్ బాబు సన్మానం

682చూసినవారు
సంత్ రవిదాస్ జయంతి: చర్మకారులకు సురేష్ బాబు సన్మానం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లోని సిమెంట్రీ పేటలో సంత్ రవిదాస్ గురూజీ 649వ జయంతి వేడుకలు ఎస్సీ మోర్చా అధ్యక్షులు తగరం సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సురేష్ బాబు చర్మకారులను సత్కరించి, సంత్ రవిదాస్ బోధనలను స్మరించుకున్నారు. వారికి నూతన వస్త్రాలు అందజేసి, వారి సేవలను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి యజ్జల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్