రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం కడియం మండలం వీరవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పూర్తిగా మంచాన పడిన ఒక అర్హురాలికి రూ. 15 వేల పెన్షన్ను పంపిణీ చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.