రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.