తూ. గో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బుధవారం రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో నిర్వహించిన వైసీపీ రూరల్ మండల సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశంలో మాట్లాడుతూ, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.