రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమాల అమలును డీఆర్ఓ ఎస్. భాస్కర్ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొలమూరు, కాతేరు, తొర్రేడు గ్రామాల్లో పర్యటించి, బూత్ స్థాయిలో జరుగుతున్న ఇంటింటి ధృవీకరణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఓటర్ల వివరాల పరిశీలన తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు నిర్వహిస్తున్న విధులను పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని సూచించారు.