రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ, అక్కమ్మ తల్లి గుడి పరిసర ప్రాంతాల్లో బుధవారం పెద్దపులి సంచరించింది. గత మూడు రోజులుగా గోదావరి పరిసర ప్రాంతాల నుంచి దారి తప్పి జనావాసాల్లో తిరుగుతున్న పులి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అటవీ అధికారుల సమాచారంతో పోలీస్, రెవెన్యూ, వైద్య రంగ అధికారులు రంగంలోకి దిగారు. అక్కమ్మ తల్లి గుడి వైపు ఎవరూ వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.