ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

1330చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 209 అర్జీలను ఆమె స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తూ, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్