పుష్కరాల నాటికి రోడ్లన్నీ అభివృద్ధి చేస్తాం

416చూసినవారు
పుష్కరాల నాటికి రోడ్లన్నీ అభివృద్ధి చేస్తాం
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పుష్కరాల నాటికి నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీలను నూతన ప్రణాళికతో పూర్తి చేస్తామని తెలిపారు. ఆదివారం R&B, PR శాఖల అధికారులతో కలిసి NH5 నుండి పాత బొమ్మూరు వరకు వయ పోలీస్ కోటర్స్, పిడింగొయ్యి, కవలగొయ్యి తదితర రోడ్లను ఆయన పరిశీలించారు. అనేకచోట్ల రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, సమగ్ర సర్వే నిర్వహించి రోడ్ల విస్తరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్