రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని, అధికారులు వాటిని తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశించారు. గురువారం నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రూరల్, కడియం మండలాల్లోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోట్లాది రూపాయలతో జరుగుతోందని ఆయన తెలిపారు.