ధవళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో గురువారం, మహిళలను అసభ్యంగా దూషించిన ఓ పత్రికాధిపతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ YCP రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాఢ సత్యప్రియ ఆధ్వర్యంలో పోలీసులకు వినతిపత్రం అందించారు. మహిళలను అవమానిస్తే సహించేది లేదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి సరిత రాణి, రుఖియా సయ్యద్, పట్టపగలు వెంకట లక్ష్మి పాల్గొన్నారు.