
పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే రాజా
సీతానగరం మండలం చిన్నకొండెపూడి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు చేకూరి సత్తిపండు రాజు అంతిమయాత్ర శుక్రవారం జరిగింది. ఈ అంతిమయాత్రలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, యువనేత జక్కంపూడి గణేష్ పాల్గొని సత్తిపండు రాజు భౌతికకాయానికి నివాళులర్పించారు. జక్కంపూడి సోదరులిద్దరూ పాడె మోసి, అంతిమయాత్రలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.







































