తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ వ్యవహారంలో జరుగుతున్న ఆరోపణలు హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ పేర్కొన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో భాగంగా గురువారం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో శుద్ధీకరణ కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ అపచారం జరిగిందని ఆయన అన్నారు.