మండల దీక్ష పూర్తయ్యే వరకు స్వాములకు నిరంతర అన్నదాన కార్యక్రమం

2చూసినవారు
మండల దీక్ష పూర్తయ్యే వరకు స్వాములకు  నిరంతర అన్నదాన కార్యక్రమం
అయ్యప్ప స్వాములకు ఆధ్యాత్మిక సేవ చేయడమే లక్ష్యంగా, మండల దీక్ష పూర్తయ్యే వరకు స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం గోకవరం స్థానిక సత్యకృష్ణ కల్యాణ మండపం (కళాభారతి)లో అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన బిక్ష కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. మండల దీక్ష పూర్తయ్యే వరకు ప్రతిరోజూ మూడు పూటలా అల్పాహారం, బిక్ష, వడి అందించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్