మామిడాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

6చూసినవారు
మామిడాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
రాజానగరం నియోజకవర్గాల పరిధిలోని పెదపూడి మండలం మామిడాడ గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు. కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పంపిణీని పండగలా నిర్వహిస్తోందని, నేరుగా ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించడం పట్ల వృద్ధులు, వితంతు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్