విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

362చూసినవారు
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
సీతానగరం మండలం రామచంద్రపురం గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ పిర్ల పోశయ్య (38) దుర్మరణం చెందాడు. పశువులకు మేత కోసం పచ్చగడ్డి కోసుకుని వస్తుండగా, కిందకు వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. పచ్చగడ్డి తడిగా ఉండటంతో విద్యుత్ ప్రవహించి పోశయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్