రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం

500చూసినవారు
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం కోరుకొండ మండలం కోటి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్