బీజేపీ గెలుపునకు ఎంతోమంది కష్టపడ్డారు: నీరుకొండ వీరన్న చౌదరి

654చూసినవారు
రాజానగరం నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు నీరుకొండ వీరన్న చౌదరి, పార్టీ గెలుపునకు ఎంతోమంది కష్టపడి సహకరించారని అన్నారు. వెదుళ్ళపల్లిలో ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ, పార్టీ కోసం సేవలు అందించిన గూడపాటి జయరాం, పెరుగు శ్రీనివాస్ జిల్లా బీజేపీ వర్కింగ్ కమిటీ సభ్యులుగా, పాలడుగుల శ్రీవిద్య తూ"గోజిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమితులయ్యారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ మరో 15 ఏళ్లు కేంద్రంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్