60 కంపెనీలతో మెగా జాబ్ మేళా: 3000 మందికి ఉపాధి

332చూసినవారు
60 కంపెనీలతో మెగా జాబ్ మేళా: 3000 మందికి ఉపాధి
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 8న ఆదివారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉదయం 9 గంటల నుండి ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో 60 బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని, దీని ద్వారా 3000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్