ఏలూరు జనసేన నిర్మాణ సారధులపై ఎమ్మెల్యే బత్తుల సూచనలు

1027చూసినవారు
ఏలూరు జనసేన నిర్మాణ సారధులపై ఎమ్మెల్యే బత్తుల సూచనలు
ఏలూరు పార్లమెంట్ జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ అబ్సర్వర్గా నియమితులైన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆదివారం గాదరాడలో ఏలూరు పార్లమెంట్ పరిధి నాయకులు కలిశారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా, ఏలూరు పార్లమెంట్ పరిధిలో చేపట్టనున్న జనసేన పార్టీ నిర్మాణ కార్యక్రమాల అమలుపై చర్చించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, నిర్మాణ సారధుల బాధ్యతలు, సమాచార సేకరణ ప్రక్రియ, కార్యాచరణ విధానాలపై ఎమ్మెల్యే పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్