రాజానగరం పరిధిలోని దివాన్ చెరువు ఫ్లై ఓవర్, లాలా చెరువులో చేపట్టబోయే అభివృద్ధి పనులపై రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంత అభివృద్ధి, ప్రజల సౌకర్యం కోసం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కట్టుబడి ఉన్నామని తెలిపారు.