తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కోరుకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పచ్చారి నరసింహమూర్తి పాల్గొని, అభాగ్యులకు ఎన్టీఆర్ భరోసా ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. టిడిపి మాజీ ఎంపీటీసీ మాత సీతారాముడు, జనసేన నాయకులు కొచ్చెర్ల బాబి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.