రాజానగరం నియోజకవర్గానికి అమరజీవి జల ధార సమగ్ర సురక్షిత మంచినీటి పథకం మంజూరు చేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీకృష్ణ తేజను కోరారు. బుధవారం అమరావతిలో ఆయన కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్యే బత్తుల, నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.