రాజానగరంలో 'చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం' అమలు కార్యక్రమంలో రూడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఉచిత విద్యుత్ పథకం’ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు.