రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నంలో మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పొందిన 15 మంది మహిళలకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతులమీదుగా శుక్రవారం కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం కేంద్రప్రభుత్వ ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా 15 మంది మహిళలకు ఉచిత గ్యాస్ స్టవ్ & గ్యాస్ సిలిండర్ అందజేసారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.