బుధవారం అమరావతిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని, ఎండోమెంట్ కమీషనర్ రామచంద్ర మోహన్‌ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలిశారు. పుష్కరాలు-2027 కింద నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రస్తుతం ప్రతిపాదించిన రూ. 98 లక్షలకు అదనంగా మరో రూ. 6.34 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వినతులకు మంత్రి సానుకూలంగా స్పందించారు.