తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు కీలక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వినతులను ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.