రాజానగరం మండలం జి. ఎర్రం పాలెం గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే బలరామకృష్ణులతో కలిసి పర్యటించారు. థర్మల్ డ్రోన్ల ద్వారా పులి జాడలను గుర్తించేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. పులి ఇదే ప్రాంతానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని, పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.