పెద్దపులి సంచారం కలకలం

2145చూసినవారు
పెద్దపులి సంచారం కలకలం
సీతానగరం మండలం చినకొండేపూడి, పెదకొండేపూడి గ్రామాల మధ్య పంట పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శనివారం ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. రాత్రివేళ ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, పశువుల పాకాల వద్ద మంటలు వేయాలని ఆయన కోరారు. పులిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్