పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో సోమవారం బొంతు వీర లక్ష్మీ గృహప్రవేశం జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లబ్ధిదారుల ఇంటిని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం అధికారి అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.