తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తొర్రేడు గ్రామానికి చెందిన రైతు ముగ్గల సత్తిరాజు రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకుని రైతును పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. సీతానగరం మండలంలో పులి సంచారం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని ఎమ్మెల్యే సూచించారు. అటవీ శాఖ అధికారుల నేతృత్వంలో పులిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.