50వ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

919చూసినవారు
50వ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పన్ను రూపాయిని మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకే తిరిగి అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజమండ్రి 50వ డివిజన్ గాంధీపురం-4 ప్రాంతంలో రూ. 27,70,000 వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, సీసీ డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 50వ డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్