బీబీ జీ రామ్ జీ పథకం పనులను పరిశీలించిన యువ నాయకులు

2028చూసినవారు
బీబీ జీ రామ్ జీ పథకం పనులను పరిశీలించిన యువ నాయకులు
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనను బలోపేతం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన 'బీబీ జీ రామ్ జీ' పథకం పనులను యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, మండల కూటమి నాయకులు గురువారం పరిశీలించారు. తిరుపతి జిల్లా మంగంపేటలో ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో, తూర్పు గోదావరి, అనపర్తి, రాజానగరం ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పురోగతిని, క్షేత్రస్థాయి విధివిధానాలను వారు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ఉపాధి, ఆర్థిక పురోగతి కోసం ఈ పథకం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్