
వైసీపీ కమిటీల నియామకం ప్రక్రియ కొరకు సన్నాహక సమావేశం
రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు సోమవారం రాజమండ్రిలో సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్ణీత గడువులోగా అన్ని గ్రామాల్లో కమిటీల నియామకం పూర్తి చేయాలని జక్కంపూడి రాజా సూచించారు. ఈ ప్రక్రియలో నాయకులందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.






































