
సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన రుడా చైర్మన్
రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో అంగర వెంకట రమణకు రూ. 42,712, ఎర్ర వెంకట్రావుకు రూ. 1,25,373, పంచెకట్ల శ్రీనుకు రూ. 67,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను RUDA చైర్మన్, రాజనగరం టీడీపీ ఇంచార్జ్ శనివారం అందజేశారు. పేద ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించడం తమ బాధ్యత అని, భవిష్యత్తులోనూ అర్హులకు సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.








































