
రామచంద్రపురం : రావి ఆకుపై చాచా నెహ్రూ చిత్రం
రామచంద్రపురం మండలం నరసాపురపుపేట ఉన్నత పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయుడు త్రినాథ ప్రసాద్ రావి ఆకుపై చాచా నెహ్రూ చిత్రాన్ని రూపొందించారు. బాలల దినోత్సవం సందర్భంగా, పిల్లలు అమితంగా ఇష్టపడే నెహ్రూ ప్రతిబింబాన్ని వినూత్నంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఆయన ఈ కళాఖండాన్ని సృష్టించారు. ఈ అద్భుతమైన సృష్టికి గాను హెచ్ఎం మాచిరాజు, పాఠశాల సిబ్బంది త్రినాథ ప్రసాదును అభినందించారు.




































